- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో అలజడికి చంద్రబాబు కుట్ర.. మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, నకిరేకల్: తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆదేశాల మేరకే జాతీయ పార్టీల్లో నియామకాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలకు చంద్రబాబు అండగా ఉంటూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతాంగం అప్రమత్తంగా లేకుంటే మోటార్లకు మీటర్లు బిగించే పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడుతుందని గుర్తుచేశారు. తెలంగాణలో చేపడుతున్న యాత్రలు గల్లీలో కాదని ఢిల్లీలో చేయాలని సూచించారు. తెలంగాణకు ఇస్తామన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించాలని హితవు పలికారు. విభజన చట్టంలో ఉన్న హామీలను సాధించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలు చేపడుతున్న యాత్రలకు జనాల ఆదరణ లేదని, కేవలం ఉనికి కాపాడుకోవడానికే యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని యాత్రలు, కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఈ కుట్రల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.