కాంగ్రెస్ పునాది వేస్తే మోడీ అమలు చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-11-13 03:46:27.0  )
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్క ఒకసారి రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను భట్టి మరోసారి చదివితే బాగుంటుందని సూచించారు. నల్ల చట్టాలకు పునాది వేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఇప్పుడు మోడీ దాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రైతుల కన్నీళ్లు తుడిచేందుకే టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించిందని పేర్కొన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు గతంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉండి 51 గంటల దీక్ష చేసిన విషయాన్ని మరచిపోవద్దన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రైతు సమస్యలపై చర్చిస్తారని వివరించారు. కేంద్రం ఒక విధానం ప్రకటిస్తే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం అపహాస్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఉత్తర భారత రైతాంగం ఆందోళనలో ఉంటే, దక్షిణ భారతదేశం సంఘీభావం తెలుపుతోందన్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఎప్పడికప్పుడు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed