- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నెలలు అవకాశం ఇస్తున్నా..
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఈఎస్ఐ ఆస్పత్రి ఉద్యోగుల నిర్లక్ష్యంపై మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యులు, ఉద్యోగులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి పరిధిలోని 29 డిస్పెన్సరీలలో స్టాఫ్ కొరత వల్ల ఐపీ, ఓపీ సేవలు అందక గోగుల ఇబ్బంది పడుతున్న విషయంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఈఎస్ఐలో 1000మంది ఉద్యోగులున్నప్పటికీ, 29 డిస్పెన్సరీల్లో ఓపీ సేవలు అందించలేరా? అని నిలదీశారు. ‘వైద్యో నారాయణో హరి అని లోకంలో కీర్తిస్తారు. వైద్యులను దేవునితో సమానంగా చూస్తారు. ప్రజలకు సేవ చేస్తూ తృప్తి పడండి. సేవ చేసే అవకాశం దేవుడు అందరికీ ఇవ్వడు, మీకు అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం ఎవరో తప్పు చేశారని ఇంకెన్ని రోజులు పట్టనట్టు అలాగే ఉంటారు.’ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలు అవకాశం ఇస్తున్నాననీ, ఈలోపల లోటుపాట్లన్నీ సర్దుకోవాలని సూచించారు. అయినా తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.