కరోనా నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం

by vinod kumar |   ( Updated:2020-04-12 01:55:48.0  )
కరోనా నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం
X

దిశ, మేడ్చల్ : కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే ఉత్తమ మార్గం అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.శనివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి భవాని ఫంక్షన్ హాల్లో పేదలకు బియ్యం, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సరుకులు పంపిణీ చేయడమే కాకుండా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న కార్మికులందరినీ గుర్తించి ఆదుకోవాలని, ఆ బాధ్యత మనందరిపైనా ఉందని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లాలో ఎవరూ ఆకలితో ఇబ్బందులు పడవొద్దన్నారు. అందుకే నిత్యం వేలాది మందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: carona, lockdown, minister mallareddy, nessecities supply

Advertisement

Next Story

Most Viewed