కరోనాకు మందు లేదు.. నియంత్రణ ఒక్కటే మార్గం: మంత్రి కేటీఆర్

by Sridhar Babu |
కరోనాకు మందు లేదు.. నియంత్రణ ఒక్కటే మార్గం: మంత్రి కేటీఆర్
X

దిశ, కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యతోపాటు మరణాల రేటు కూడా పెరుగుతోందని, వైరస్‌కు మందు లేదని నియంత్రణ ఒక్కటే మార్గమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, ఈ వైరస్‌కు నియంత్రణే అసలైన మెడిసిన్ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, అందువల్లే జిల్లాలో ఒక్కటే పాజిటివ్ కేసు నమోదైందన్నారు. మళ్లీ కొత్త కేసు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పల్లె ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నారు కానీ, పట్టణాల్లోని యువత పాటించడం లేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అధికారులకు సహకరించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. మరో రెండు వారాలు ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు. వేములవాడ పట్టణంలోని కంటైన్‌మెంట్ ఏరియాలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజలతో ముచ్చటించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కంటెైన్ మెంట్ ఏరియాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ముస్తాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ లాగా మారిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags: carona, lockdown, minister ktr, sirsilla dist

Advertisement

Next Story

Most Viewed