- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం
దిశ, వెబ్‌డెస్క్:
తెలంగాణను ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించామని తెలిపారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ విజయవంతం అయ్యాయి. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించేలా నూతన విధానం రూపొందించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.