ఈ నెల 14న గద్వాల జిల్లాకు మంత్రి కేటీఆర్.. షెడ్యూల్ ఇదే..!

by Anukaran |
ktr twitter
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: జోగులాంబ గద్వాల జిల్లాకు ఈ నెల 14న మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రానున్నట్లుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మంత్రుల షెడ్యూల్‌ను వెల్లడించారు.

మంత్రుల పర్యటన, అభివృద్ధి పనుల వివరాలు..

*తొలుత జూరాల ప్రాజెక్టు వద్ద రూ. 15 కోట్ల వ్యయంతో పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన..
*రూ. 30 లక్షల వ్యయంతో గోనుపడు వద్ద షాదీఖానా భవనం..
*రూ. కోటి యాభై లక్షలతో సంఘాల రిజర్వాయర్ వద్ద సంఘాల పార్కు..
* మహాలక్ష్మి దేవి కళాశాల ప్రాంగణంలో రూ. కోటి 60 లక్షల వ్యయంతో జిల్లా గ్రంథాలయం.. మరో రూ. కోటి యాభై లక్షల వ్యయంతో కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం..
*రూ. 6 కోట్ల 25 లక్షల వ్యయంతో ఇండోర్ ఆడిటోరియం..
*రూ. 25 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం..
*రూ. 15 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్..
*రూ. 4 కోట్ల వ్యయంతో జిల్లాలో నూతన ఆర్టీసీ భవన నిర్మాణం..

రూ. 10 కోట్ల వ్యయంతో మహిళా పీజీ కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే, మరో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్‌ఓబీ ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed