టీఎస్ బీపాస్​ విధానంతో గొప్ప మార్పు !

by Shyam |
టీఎస్ బీపాస్​ విధానంతో గొప్ప మార్పు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌ ‌బీపాస్‌ విధానం గొప్ప మార్పును తీసుకొస్తుందని, బీపాస్‌ ద్వారా వచ్చిన కాగితమే మీకు ఆయుధమని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం టీఎస్‌ బీపాస్‌ను మంత్రి ప్రారంభించారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూలో టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌‌ను డిజైన్ చేశారు. దరఖాస్తుదారు స్వీయ ధృవీకరణతో నిర్ణీత గడువులోగా అనుమతులు, ధృవపత్రాలు జారీ చేయనున్నారు. 75గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు అనుమతి అవసరం లేదు. 600గజాల లోపు గృహాలకు స్వీయ ధృవీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతి లభించనుంది. బీపాస్​ దరఖాస్తులకు 21రోజుల్లో అనుమతి ఇస్తారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ఓ సాహసోపేతమైన నిర్ణయమని, టీఎస్‌‌బీపాస్‌ లాంటి పారదర్శక చట్టం దేశంలో ఎక్కడా లేదన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇదివరకటిలా అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, దరఖాస్తు చేసుకున్న 21రోజుల్లో అనుమతి వస్తుందన్నారు. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాదిలో జీహెచ్‌ఎంసీ కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed