అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ :కేటీఆర్

by Anukaran |   ( Updated:2020-11-17 01:17:16.0  )
అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ :కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్ నగరంలో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనులను మంగళవారం మంత్రి కేటీఆర్ పరిశీలించారు. 14వ అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత భద్రతమైన నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మిస్తున్నామని.. ఇప్పటికే 85 శాతం పూర్తయిందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో 19 అంతస్తుల నిర్మాణం జరుగుతుందన్నారు. పది లక్షల సీసీ కెమెరాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నిర్మిస్తున్నామని.. 360 డిగ్రీల కోణంతో నగరంపై నిఘా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ వెంట హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్‌ రామ్మోహన్‌ ఉన్నారు.

Advertisement

Next Story