- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ భారతదేశంలో బెస్ట్ ప్లాంట్ :కేటీఆర్
దిశ, వెబ్డెస్క్ :
హైదరాబాద్ లోని జీడిమెట్లలో శిథిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 15 ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో రీ సైక్లింగ్ ప్లాంట్ ను నిర్మించారు. ఈ ప్లాంట్ రోజుకు 500 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే ఈ ప్లాంట్ అతి పెద్ద ప్లాంట్ అని స్పష్టం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని నిర్మించినట్లు చెప్పారు. ఈ ప్లాంట్ పరిసరాల్లో ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. నగరంలో 2 వేల ఎంఎల్‌డీల సివరేజ్, డ్రైనేజీ ఉత్పత్తి అవుతుంటే.. 41 శాతాన్ని ఎస్టీపీల ద్వారా శుద్ది చేసి మూసీలోకి వదులుతున్నామని అన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం శుభ పరిణామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఐదు రకాల వ్యర్థాలను సవ్యంగా వినియోగించే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని కోసం ఒక ప్లాంట్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు ఎల్బీనగర్ ఫతుల్లాగూడలో మరో సీ అండ్ డీ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.