- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకే ఈ దేశం బాకీ ఉంది :కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం మనకు ఇచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువగా ఇచ్చామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకే ఈ దేశం బాకీ ఉందన్నారు. జలవిహార్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రోడ్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జీలు ఎన్ని నిర్మించుకున్నామో మీ కళ్ల ముందే ఉన్నాయన్నారు. గండిపేటను మించిన చెరువును త్వరలో నిర్మిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాళాలను బాగు చేయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు 15 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాల సీఎంలను బీజేపీ నేతలు తీసుకొస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ప్రచారానికి ప్రధాని మోదీ కూడా వస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ నుంచి వస్తున్నారు.. ట్రంప్ కూడా ఖాళీగా ఉన్నారు, ఆయన్ను కూడా పట్టుకొస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత మాట్లాడితే దేశ భక్తులు, దేశద్రోహులు అంటారని విమర్శించారు.