- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని దోమలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకే పరిమితం కాలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు ఖరారైపోయిందని తెలిపారు. వాణీదేవికి కొంతమంది రాజస్యసభ ఇవ్వాలంటున్నారు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎప్పుడైనా ప్రజాక్షేత్రం నుంచే పోటీచేశారని గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఐటీఐఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. జీడీపీ అంటే ఇప్పుడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాంచందర్‌రావు ఎందుకు మాట్లాడటం లేదని.. ఆరేళ్లుగా రాంచందర్‌రావు ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు.