రచయిత కందికొండకు అండగా ఉంటాం.. మంత్రి కేటీఆర్ హామీ

by Shyam |
రచయిత కందికొండకు అండగా ఉంటాం..  మంత్రి కేటీఆర్ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాటలతో పాటు ఎన్నో గేయాలు రచించిన రచయిత కందికొండ యాదగిరిని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం వెల్లడించారు. గతంలోనూ ఆయనకు అండగా ఉన్నామని, ఇకపై కూడా ఉంటామని తెలిపారు. కందికొండ కుమార్తె మాతృక ట్వీట్‌పై మంత్రి స్పందిస్తూ.. ‘‘ కందికొండ విషయమై తమ సిబ్బంది మాట్లాడతారు. వారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సమన్వయం చేస్తారు ’’ అని రిప్లై ఇచ్చారు. తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామని, అద్దె కట్టలేకపోతున్నామని కందికొండ కుమార్తె మాతృక ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మ… మా పిడికిట్ల వరి బువ్వ మెతుకుల బతుకమ్మ…, మళ్ళి కూయవే గువ్వా…. మోగిన అందెల మువ్వా…, గల గల పారుతున్న గోదారిలా…జలజల జారుతుంటే కన్నీరెలా..! ఇలా పలు పాటలను రాశారు కందికొండ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, పండుగల విశిష్టత, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలను రచించారు. ప్రస్తుతం ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఎక్కువకాలం థెరపీ చేయించుకోవడంతో స్పైనల్ కార్డ్ లోని ఒన్ టూ విభాగాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కందికొండ ఆరోగ్య పరిస్థితిని పలువురు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వివరించారు. స్పందించిన ఆయన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed