- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narayankhed MLA : ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం..
దిశ, నారాయణఖేడ్: ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు.నిరుపేద ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి కంగ్టి మండలంలో 14, మానూర్ మండలం 11నగాల్ గిద్ధ మండలం 54 , ముఖ్యమంత్రి సహాయనిధి 16 చెక్కులను నారాయణఖేడ్ నివాసంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు కల్యాణలక్ష్మి చెక్కులు , షాది ముబారక్ చెక్కులను కాంగ్రెస్ వారు అని తెలిస్తే చాలు వారికి చెక్కులను ఇవ్వకుండా వారికి ఇబ్బందులు కలిగించే వారని,గత బీఆర్ఎస్ నాయకుల లాగా వ్యవహరించకుండా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వివాహం జరిగిన 5 నెలలు లేదా 6 నెలల లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికి మా ఈ ప్రజా ప్రభుత్వంలో పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అదే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు .
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజ్ రెడ్డి, రమేష్ చౌహాన్, న్యాయవాది కేస్వార్ సంజీవ్ ,వినోద్ పాటిల్,గుండె రావు పాటిల్, ప్రభాకర్ రెడ్డి,ఆనీల్ పాటిల్ తాజా మాజీ సర్పంచ్ లు,అంజిరెడ్డి, దొండే రావు పాటిల్, పండరి నాథ్ మాజీ ఎంపీటీసీలు,యాదవ్ రెడ్డి,జ్ఞానేశ్వర్ పాటిల్, పల్లవి పరశురాం,మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,కే.అఖిలేష్ రెడ్డి,ఆకాశ్ రావు పాటిల్, కురుమ రాజు, సంతోష్ కుమార్, బి.హనుమంతు, కూర్తే శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు దేవదాస్ , తదితరులు పాల్గొన్నారు.