Additional Collector Nagesh : రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు

by Aamani |
Additional Collector Nagesh : రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం హవేలీ ఘన్పూర్ మండలం కొత్తపల్లి లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో కొనుగోళ్లు చేపట్టాలని, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏదైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.

జిల్లాలో 490 సెంటర్లు ప్రారంభించడం జరిగిందని ఇప్పటివరకు 1870 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రవాణా సంబంధిత విషయాల్లో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సన్న, దొడ్డు రకం ధాన్యం బస్తాలు విడివిడిగా భద్రపరచాలని, రకాలు గుర్తించడానికి వీలుగా చెరిగిపోకుండా గుర్తులు వేయాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ట్యాగింగ్ చేసిన మిల్లులకు రవాణా చేసేందుకు, రవాణాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్ తాసీల్దార్, సింధు రేణుక డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed