Bullet Train : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం

by M.Rajitha |
Bullet Train : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్(Bullet Train Project) లో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్(Gujarath) లోని ఆనంద్(Anand) జిల్లా వసాద్(Vasad) వద్ద బుల్లెట్ ట్రైన్ కోసం నిర్మిస్తున్న పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పిల్లర్ల శిథిలాల కింద భారీగా కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఇద్దరు కార్మికుల మృత దేహాలను శిథిలాల కింది నుంచి వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలియ జేశారు.

Advertisement

Next Story