suicide : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
X

దిశ,తిరుమలాయపాలెం : మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన కౌలు రైతు కొండ జగదీష్​ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదీష్​ రెండు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని అందులో పత్తి పంట సాగుచేశాడు. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాక అప్పులు తీరవని మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మరణించాడు. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఈ మేరకు మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదేష్​ తెలిపారు.

Advertisement

Next Story