- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC Rankings : 3వ ర్యాంక్‌కు చేరువగా స్మృతి మంధాన.. 77 స్థానాలు ఎగబాకిన ప్రియా మిశ్రా
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయం తర్వాత భారత మహిళా క్రికెటర్లు తమ వన్డే ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 4వ ర్యాంక్‌ను కాపాడుకుంది. అయితే, కివీస్‌పై మూడో వన్డేలో శతకం బాదిన ఆమె రేటింగ్ పాయింట్లను 703 నుంచి 728కి పెంచుకుంది. దీంతో 3వ ర్యాంక్‌కు చేరువగా వచ్చింది. ప్రస్తుతం 3వ ర్యాంక్‌లో ఆటపట్టు(శ్రీలంక) ఉండగా.. మంధాన కేవలం 5 పాయింట్ల దూరంలోనే ఉన్నది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తిరిగి టాప్-10లో స్థానం సంపాదించింది. మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకుంది. దీప్తి శర్మ 19వ స్థానానికి చేరుకోగా.. జెమిమా రోడ్రిగ్స్ 30వ ర్యాంక్‌లో ఉంది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ 2వ ర్యాంక్‌ను కాపాడుకోగా.. రేణుక సింగ్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ ర్యాంక్‌కు చేరుకుంది. యువ బౌలర్ ప్రియా మిశ్రా ఏకంగా 77 స్థానాలను ఎగబాకడం విశేషం. తొలిసారిగా టాప్-100లో చోటు దక్కించుకున్న ఆమె 83వ స్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది.