- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఆ పని చేయదు.. టీఆర్ఎస్‌ను చేయనీయదు: కొప్పుల ఈశ్వర్
దిశ, జమ్మికుంట: దళితుల జీవితాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. దళితులు బాగుపడడం ఏమాత్రం ఇష్టం లేని బీజేపీ నాయకులు ఆ పథకాన్ని నిలిపివేసి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏమీ చేయకపోగా.. చేసేవారిని కూడా చేయనివ్వడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటల కూడా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మనందరి కోసం ప్రతినిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు ఇస్తే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకోసం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు పాల్గొన్నారు.