నిమ్మగడ్డ రమేశ్ టీడీపీలో చేరుతారు: కొడాలి నాని

by srinivas |
నిమ్మగడ్డ రమేశ్ టీడీపీలో చేరుతారు: కొడాలి నాని
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు కోర్టులు బుద్ధి చెప్పాయని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేకుంటే తప్పుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తే ప్రజలు వెంటపడి కొడతారన్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు పార్క్ హయత్‌లోనే నిమ్మగడ్డకు ట్రైనింగ్ ఇచ్చారన్న మంత్రి కొడాలి నాని.. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పునకు బాధ్యత వహిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాజీనామా చేయాలన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరుతారని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed