- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారందరికీ ఇండ్లు ఇచ్చే కారక్రమం చేపట్టాలి: కిషన్ రెడ్డి
దిశ, ముషీరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బాగ్ లింగపల్లి లంబాడీ తండలో రూ. 10.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, రూ.3.50 కోట్ల వ్యయంతో అడిక్ మెట్‌లో నిర్మించిన మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…నగరంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇండ్లు లేని పేదలు చాలా మంది ఉన్నారని, వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేస్తామని అన్నారు.ఒక్క ఇంటికి 9 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసిందన్నారు.
వీటిని లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను అమ్ముకోవడం, ఇతరులకు కిరాయికి ఇవ్వడం చేయొద్దని స్పష్టం చేశారు. ఇళ్లు ఆత్మగౌరవానికి నిదర్శనమని, ఇళ్లును ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన ఇంటి పరిసరాలను, బస్తీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.