యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాలి -కన్నబాబు

by srinivas |
యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాలి -కన్నబాబు
X
దిశ, ఏపీ బ్యూరో : తూర్పు గోదావరి జిల్లాలో రహదారులకు పడిన గండ్ల పూడ్చివేత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొన్నారు. పంట న‌ష్టపోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
Advertisement

Next Story