- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్ఐ ని బెదిరించిన మినిస్టర్ జయరాం.. హల్ చల్ చేస్తున్న ఆడియో క్లిప్ లు
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆడియో లీక్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మహిళతో మాట్లాడిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమంత్రి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది మహిళతో కాదండోయ్. ఒక పోలీస్ అధికారిని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మంత్రి జయరాం తన సొంత నియోజకవర్గమైన ఆలూరులో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది.
ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా ఎస్ఐ ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన ట్రాక్టర్లను విడుదల చేయాలంటూ మంత్రి ఎస్ఐకు ఫోన్ చేశాడు. ఆ ట్రాక్టర్లను వదిలిపెట్టాలని ఆదేశించారు. ఇల్లీగల్‌గా కాకుండా లీగల్‌గా చేసుకోవాలని సూచించారు. దీంతో ఎస్ఐపై మంత్రి జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయ్.. లేకపోతే ధర్నాకు దిగుతానంటూ గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి జయరాం స్పందించాల్సి ఉంది.