- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం’
దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు సంయమనం పాటించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్లపై నల్లగొండ కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ లతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ప్రారంభించిన 376 కొనుగోళ్ల కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 4 లక్షల 70 వేల 38 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 22,944 మంది రైతులకు 335.97 లక్షల నగదు చెల్లింపులు చేశామన్నారు. ముందెన్నడూ లేనంత రీతిలో రికార్డ్ స్థాయిలో దిగుబడి నమోదు కావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థతి లేదని ఆయన అన్నారు.
ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లాక్ డౌన్ ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలుగకుండా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్‌కు సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్ రావు, డీసీఓ ప్రసాద్, డీఆర్డీవో పీడీ శేఖర్ రెడ్డి, ఆర్టీవో సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.