పిల్లలమర్రి గ్రామంలో మంత్రి పర్యటన

by Shyam |
పిల్లలమర్రి గ్రామంలో మంత్రి పర్యటన
X

దిశ, సూర్యాపేట: మున్సిపాలిటీలో విలీనమైన పిల్లలమర్రి గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలోని శివాలయం పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. దేవాలయ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం రూ. 7 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పుట్టకిషోర్, జెడ్పీటీసీ జీడీ బిక్షం, కౌన్సిలర్ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story