‘ఆ వృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు’

by Shyam |   ( Updated:2020-08-27 04:51:12.0  )
‘ఆ వృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు’
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: గత పాలకుల హయాంలో ఆదరణ కోల్పోయిన కుల వృతులకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కుల వృతులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గురువారం కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలోని రావి చెరువుతో పాటు తన దత్తత గ్రామం అయిన చీదేళ్ల పెద్ద చెరువులో రెండు లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు గుతోందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా 80 కోట్ల చేపపిల్లలు, 5 కోట్ల రొయ్యపిల్లలను చెరువుల్లో వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదని అన్నారు. తడి ఆరిన తెలంగాణ బీడు భూములను కాళేశ్వరం ద్వారా పున:జ్జీవం పోస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, తదితర అధికారులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed