ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఆయనదే : మంత్రి జగదీశ్ రెడ్డి

by Sridhar Babu |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఆయనదే : మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, సూర్యా పేట : ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కొటిరెడ్డి విజయం ఖాయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ పోలింగ్‌ కేంద్రంలో మంత్రి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. సి కోటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న మంత్రి ఈ ఎన్నికల్లో ఇతర పార్టీల సభ్యులు కూడా టీఆర్ఎస్‌‌వైపే నిలవడం శుభపరిణామం అన్నారు.

Advertisement

Next Story