- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి కేసీఆర్ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది : ఇంద్రకరణ్ రెడ్డి
X
దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు.
రైతులకు మద్ధతుగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Advertisement
Next Story