- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా.. హడావుడేనా !
దిశ, మెదక్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఆయా దేశాలు లాక్‌డౌన్‌లు విధించి వైరస్ విస్తరించకుండా చర్యలు చేపడుతున్నాయి. కానీ మన దగ్గర ప్రజలంతా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమై బిక్కు బిక్కు మంటూ కాలం ఎల్లదీస్తుంటే, కేంద్ర, రాష్ట్రాలు చేపడుతున్న చర్యలు అనుకున్నంత రీతిలో కార్యరూపం దాల్చట్లేదు. కరోనా వైరస్ నివారణకు అధికారులు, ప్రజా ప్రతినిధుల హడావుడే తప్ప ఆచరణలో స్పష్టంగా కనిపించకపోవడం గమనార్హం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ నివారణకు అధికారులు, ప్రజా ప్రతినిధుల హడావుడి అంతా ఇంతా ఉండటం లేదు. వైరస్ నివారణకు తలకుమించిన కష్టం చేస్తున్నట్లు ఉంది తప్ప, ఏమీ లేదు. ఒక్క సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయటం మినహా ఇతర చర్యలు శూన్యం. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ప్రకటించినా స్థానికంగా మున్సిపల్, గ్రామ పంచాయతీలకు కేటాయించలేదని ఆ శాఖలకు సంబంధించిన అధికారులే చెబుతుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ నివారణకు మంత్రి హరీశ్‌రావు అన్నిరకాల చర్యలు చేపడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం మాత్రం చేసిన కాడికి చేసి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మార్చి 30న మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో హైపో క్లోరైడ్‌ను పిచికారి చేసే యంత్రాలను ప్రారంభించారు. తొలిరోజున సిద్దిపేట పట్టణంలోని సుభాష్‌రోడ్డు, లాలాకమాన్, పాత బస్టాండ్, విస్టరీ టాకీస్, సర్కిల్ తదితర ప్రాంతాల్లో పిచికారి చేశారు. ఈ యంత్రాలను ప్రారంభించి శుక్రవారం నాటికి 5 రోజులవుతున్నా, మెయిన్ రోడ్డుతో పాటు ఒకట్రెండు వార్డుల్లోనే పిచికారి చేశారు తప్ప మిగత చోట్లలో పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రోడ్డు పక్కన ఉన్న గల్లీలను పూర్తిగా విడిచిపెట్టడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కూడా పైరవీలు చేస్తున్నారన్న విమర్శలు సైతం వినపడుతున్నాయి. రెండు యంత్రాల్లో ఒకటి రిపేరులో ఉండగా, మరొకటి సంగారెడ్డికే పరితమైంది. పనిచేసిన నాలుగు రోజుల్లోనూ కేవలం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన రోడ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మంత్రి హరీశ్‌రావు వస్తేనే హడావుడి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలెవరూ అనారోగ్యానికి గురికావొద్దు, ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో మంత్రి హరీశ్‌రావు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ నిరంతం శ్రమిస్తున్నారు. మొన్నటికి మొన్న రిస్క్ తీసుకొని 40వేల శానిటైజర్లను సిద్దిపేటకు తీసుకువచ్చారు. కానీ మంత్రి ఆలోచనలకు, చొరవకు కొందరు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంత్రి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడేందుకు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తామే పనిచేస్తున్నట్లు హల్‌చల్ చేస్తుంటారు. కానీ మంత్రి స్థానికంగా లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు చాలా తక్కువే ఉన్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే శానిటైజర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ మినహా మరెక్కడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. బెజ్జంకి మండలవాసిని అని చెప్పుకునే మంత్రి అసలు బెజ్జంకి వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
Tags: corona, effect, lockdown, minister, harishrao, medak, siddipet, sanitizers