- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్ డాక్టర్లకు మంత్రి హరీశ్ రావు ఝలక్.. చర్యలకు రంగం సిద్ధం
దిశ, తెలంగాణ బ్యూరో : సర్కార్దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి హరీష్‌రావు తనదైన శైలీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో జీతం తీసుకుంటూ, ప్రైవేట్‌లో సేవలు అందిస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఫోకస్ పెట్టనున్నారు. ఆయా హాస్పిటల్స్‌లో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతున్న డాక్టర్లపై నిఘా పెట్టాలని హెల్త్ హెచ్ఓడీలకు మంత్రి అంతర్గత ఆదేశాలిచ్చినట్టు సమాచారం. డ్యూటీ సమయాల్లో ఆసుపత్రులకు రాని వారిపై, ఆలస్యంగా వస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు సర్కార్వెనకాడబోదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోని కీలక ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు వివరించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్‌లో క్లినిక్‌లు నిర్వహిస్తున్న డాక్టర్ల డేటా, పనితీరుపై రిపోర్టు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి అధికారులను సూచించినట్లు ఓ కీలక అధికారి ‘దిశ’కు తెలిపారు.
ఓపీ తర్వాత ఊసే ఉండదు…
ప్రైవేట్ క్లినిక్‌లు నడిపిస్తున్న ప్రభుత్వ డాక్టర్లలో 50 శాతం మంది నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ విజిలెన్స్ టీంలు గుర్తించాయి. ప్రధానమైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌తో పాటు సర్కార్జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లోనూ అదే తీరు ఉన్నది. ఉదయం ఓపీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి సొంత క్లినిక్‌లు నడుపుతున్నట్లు గుర్తించారు. టీచింగ్ఆసుపత్రుల్లోనైతే మధ్యాహ్నం 2 తర్వాత వచ్చే వాళ్లు కూడా ఉన్నారని స్వయంగా ఉస్మానియా, గాంధీ అడ్మినిస్ట్రేటివ్ అధికారులే ఆఫ్‌ది కార్డుగా చెబుతున్నారు. తాము ఎన్ని సార్లు చెప్పినా, తీరు మార్చుకోవడం లేదని ఆ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు కావడంతో అడ్మినిస్ట్రేటీవ్ఆఫీసర్లు కూడా వారిపై ఒత్తిడి తేలేకపోతున్నారు.
రోగులకు తప్పని ఇబ్బందులు…
సర్కార్ దవాఖానల్లో ప్రతీ పేషెంట్‌ను అత్యధికంగా పీజీ వైద్యులు, జూడాలే చికిత్సలు నిర్వహిస్తున్నారు. చాలా మంది సీనియర్, హెచ్ఓడీల స్థాయిలో ఉన్న డాక్టర్లకు క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒప్పందాలు ఉండటంతో ఇక్కడ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు దృష్టి పెట్టడం లేదు. మొక్కుబడిగా విధులకు వస్తూ, ఐదారుగురిని పరిశీలించి, సొంత క్లినిక్డెవలప్పై అలోచిస్తున్నారు. దీంతో సీనియర్డాక్టర్లు పరిశీలిన కొరకు రోగులు రెండు, మూడు రోజులు ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇన్‌వార్డులో ఉన్నోళ్లనైతే 95 శాతం పీజీలే పర్యవేక్షిస్తూ చికిత్సను అందిస్తున్నారు. సర్కార్ నుంచి తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తున్నామనే ఆలోచనే లేకుండా కొందరు డాక్టర్లు ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారు. మరి కొంతమంది డాక్టర్లు ఇక్కడ రోగులు రద్దీ ఎక్కువగా ఉంటుందని, తమ క్లినిక్, ఆసుపత్రులకు వచ్చేయడంటూ రోగులను నేరుగా రిఫర్చేయడం గమనార్హం. ఇప్పటికే సర్కార్అలాంటి డాక్టర్ల జాబితాను తయారు చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సర్కార్ దవాఖాన్లను కాపాడుకోవాలి
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోన్నది. సీఎం కేసీఆర్ సూచనతో మంత్రి హారీష్‌రావు కీలక మైన నిర్ణయాలు తీసుకుంటూ వైద్యవ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వానికి సహకరించాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన జీఓ ప్రకారం ఉదయం 9 నుంచి 4 తర్వాత ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రుల్లో తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన ఉన్నది. ప్రైవేట్ క్లినిక్‌లున్న వైద్యులు దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలను డాక్టర్ల సంఘాలు మద్ధతిస్తాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య తెలంగాణ మార్చడమే ప్రభుత్వం, వైద్యుల లక్ష్యం. ఆ దిశగా ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.
-డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు