- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విర్రవీగినా.. వాళ్లకు మనమే వ్యాక్సిన్ ఇస్తున్నాం
దిశ, సిద్దిపేట: సిద్దిపేట కోమటి చెరువు-నెక్లెస్ రోడ్డుపై ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని, సీఎం కేసీఆర్‌కు అనుకూలమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని తెలిపారు. విర్రవీగి కరోనాతో విలవిలాడుతోన్న వారందరికీ మనదేశం, మన రాష్ట్రం నుంచే కరోనా వ్యాక్సిన్ పోతున్నదని, పాశ్చాత్య ధోరణులకు మోడల్ అనుకునే దేశాలన్నీ మన దేశ పద్దతులు, సంప్రదాయాలకే విలువ ఇస్తున్నాయని తెలిపారు. ధర్మాన్ని కాపాడుకునేలా, హిందూ ధర్మాన్ని పాటించి, దేవాలయ పరిరక్షణకు పూనుకోవాలని అన్నారు. దశాబ్దాలుగా వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మూలాలను మరవొద్దని సూచించారు. అనంతరం కోమటి చెరువు మధ్యలో 15 నిమిషాల పాటు వచ్చే మ్యూజికల్ పౌంటెన్ ప్రారంభించి కాసేపు సరదాగా బోటింగ్ చేశారు.