- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్లపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో టీచర్స్ డే సందర్బంగా ఆయన ట్రస్మా నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఆయా జిల్లాల వారికే 92 శాతం స్థానికత ఆధారంగా ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యారంగంపై తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తోందన్నారు.
హుజురాబాద్‌లోని ప్రైవేటు ఉపాధ్యాయుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయనున్నామన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా ప్రైవేటు టీచర్లను భాగస్వాములను చేయనున్నామని మంత్రి వెల్లడించారు. పాఠశాలలు మళ్లీ ప్రారంభం అయినందున బ్యాంకర్లతో మాట్లాడి ప్రైవేటు విద్యా సంస్థలకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి ప్రకటించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం మొదటి స్థానంలో ఉందని, గ్యాస్ ధరలు పెంచుతున్న కేంద్రం సబ్సీడీని మాత్రం పెంచడం లేదన్నారు. హుజురాబాద్ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని, సెంటిమెంట్ కన్నా హుజురాబాద్ అభివృద్ధే ముఖ్యమన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హరీష్ రావు సూచించారు.
న్యాయం, ధర్మం విశ్లేషించి ధర్మం వైపు నిలబడాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. త్వరలో ట్రస్మా భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆర్థిక పరిస్థితిని గమనించే ముఖ్యమంత్రి ప్రైవేటు టీచర్లకు ఉచిత బియ్యం అందించారని అన్నారు.
Read more