- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను ఆదుకుంటాం : హరీష్ రావు
దిశ, ఆందోల్: వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంట నష్టం వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సింగూరు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతుండడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ప్రాజెక్టు నిండుకోవడంతో జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌లతొ కలిసి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పంటల నష్టం వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.
వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా చెడిపోయిన రోడ్లు, వంతెనలు, కల్వర్టుల వివరాలు సేకరించాలని, వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలో 42 వంతెనలు బాగా దెబ్బతిన్నాయని, లో లెవెల్ కల్వర్టులను అభివృద్ధి పరిచేందుకు రూ.45 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పరివాహక ప్రాంతంలోని కొన్ని వ్యవసాయ పొలాల్లోని పంటలను పరిశీలించారు. ఆయనతోపాటు కలెక్టర్ హనుమంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.