త్వరితగతిన భూసేకరణ చేపట్టండి: హరీశ్‌రావు

by Shyam |   ( Updated:2020-04-08 23:01:14.0  )
త్వరితగతిన భూసేకరణ చేపట్టండి: హరీశ్‌రావు
X

దిశ, మెదక్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనుల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపారు. జిల్లాలోని ఎల్లాయపల్లి, విఠలాపూర్, మాచాపూర్, గంగాపూర్, చంద్లాపూర్, రామంచ, పుల్లూరు, చిన్నగుండవెళ్లి, బూర్గుపల్లి, ఇర్కోడ్, ఎన్సాన్ పల్లి, వెంకటాపూర్, బండారుపల్లి, ఎల్లారెడ్డి పేట, ఘనపూర్ తుక్కాపూర్ గ్రామాల్లో కాల్వల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని అత్యవసర పనులకు ఆటంకాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు మంత్రి సూచించారు.

Tags: minister harish rao, review meeting, irrigation projects

Advertisement

Next Story