యూరియా కోసం మండలానికి రావొద్దు: హరీశ్ రావు

by Shyam |
యూరియా కోసం మండలానికి రావొద్దు: హరీశ్ రావు
X

దిశ, మెదక్: యూరియా కోసం రైతులు చిన్నకోడూర్, సిద్దిపేట మండల కేంద్రాలకు రావొద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. యూరియా బస్తాలు ఎక్కడికక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని గంగాపూర్ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆదివారం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గంగాపూర్ వాగుపై వెలసిన గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story