సంగారెడ్డి నూతన జడ్పీ భవనం ప్రారంభం

by Shyam |
సంగారెడ్డి నూతన జడ్పీ భవనం ప్రారంభం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ భవనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రికి పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నూతన జడ్పీ భవన నిర్మాణంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు. గతంలో ఉన్న జడ్పీ భవనంలో చీరిగిన సీట్లు, ఉక్కపోతతో ఇరుకుగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నూతన భవనాన్ని నిర్మించామన్నారు. సమావేశాలకు వచ్చే కొత్త సభ్యులు అవగాహన పెంచేకోవాలని.. ప్రతి విషయాన్ని వినాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత‌రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story