హుజురాబాద్‌లో టీఆర్ఎస్ vs బీజేపీ మధ్యే పోటీ : హరీష్ రావు

by Sridhar Babu |
Minister Harish Rao
X

దిశ, హుజురాబాద్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక బీజేజీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగే ఉప ఎన్నిక అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకూ, అన్ని వర్గాల వారికి చేరేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed