ఆ కమిటీలో హరీశ్ రావుకు చోటు..

by  |   ( Updated:2020-07-22 22:20:54.0  )
ఆ కమిటీలో హరీశ్ రావుకు చోటు..
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి కొన్ని మార్పులు చేసి, ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. అయితే ఈ నూతన కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది.

Advertisement

Next Story