- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ప్రభుత్వం వారి నేస్తం: గౌతం రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం నేతన్నల నేస్తం అంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ‘వైఎస్సార్నేతన్న నేస్తం’ రెండో విడత సాయాన్ని విడుదల చేసిన మంత్రి.. 8,903 చేనేత కుటుంబాలకు రూ.21.31కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో చేనేత కుటుంబాలతో మాట్లాడారు. మగ్గాలను ఆధునీకరించుకుని మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు.
సీఎం జగన్ ఉదార గుణం వల్లే నేడు మరింత మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం అందుతున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సాయమందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల్లోని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వ సాయం, పథకాలపై అవగాహన పెంచి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని కోరారు. సొంత మగ్గం కలిగి దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ద్వారా ఏటా రూ.24 వేలను ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి గౌతంరెడ్డి వివరించారు.