పడవ నడిపిన మంత్రి గౌతంరెడ్డి

by srinivas |
పడవ నడిపిన మంత్రి గౌతంరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: పాతికేళ్ల తర్వాత పెన్నా నదికి వచ్చిన అదిపెద్ద వరద ఇదే అని, ఈ వరదల కారణంగా ఇళ్లు, పంటలు దెబ్బతిన్న ప్రతీ ఒక్కరికీ సాయం అందేట్లు చూడాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలిస్తామని తెలిపారు. కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చేజర్ల, సంగం, అనంతసాగరం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. స్వయంగా పడవ నడుపుతూ నీట మునిగిన వీర్లగుడిపాడు గ్రామానికి వెళ్లారు. వీర్లగుడిపాడుకు బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో చూడాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జి కట్టిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story