ప్రభుత్వ వైద్యంపై నమ్మం కలిగేలా చికిత్స

by Sridhar Babu |
ప్రభుత్వ వైద్యంపై నమ్మం కలిగేలా చికిత్స
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా సేవలందించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైద్యులు, అధికారులు సమన్వయంతో పని చేసి రోగుల్లో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ పేషెంట్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని, మందులు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.

కరోనా మరణాల రేటును తగ్గించేలా కృషి చేయాలని, మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేకంగా ఐదుగురు వైద్యులను నియమించామన్నారు. 20 మంది స్టాఫ్ నర్సులను రేపే నియమిస్తామని, మరో 16 మంది హెడ్ నర్సులను నాలుగైదు రోజుల్లో నియమిస్తామని చెప్పారు. కోవిడ్ పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటుకు పది నిమిషాల్లో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే బతుకుతామనే భరోసా ప్రజలకు కల్పించాలని చెప్పారు. కరీంనగర్ ఆసుపత్రిలో 125 ఆక్సిజన్ సిలెండర్లు, 180 పడకలు కోవిడ్ పేషెంట్ల కోసం సిద్ధంగా ఉన్నాయని మంత్రి కమలాకర్ వివరించారు.

Advertisement

Next Story