కేంద్రం వాటాతో పాటు మా వాటా 5కేజీలు : గంగుల

by Sridhar Babu |
కేంద్రం వాటాతో పాటు మా వాటా 5కేజీలు : గంగుల
X

దిశ, కరీంనగర్: దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున నవంబర్ నెల చివరి వరకు ఉచితంగా 5కేజీల బియ్యం, పప్పుదినుసులు పంపిణీ చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం వాటాతో పాటు రాష్ట్రం తరఫున నిరుపేదలకు మరో 5 కిలోల బియ్యాన్ని కలిపి 10కేజీల చొప్పున పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కరీంనగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

రాష్ట్రంలో 87 లక్షల రేషన్ కార్డుల ద్వారా రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది చేకూరనుందని వివరించారు. జులై నుంచి నవంబర్ నెల వరకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి గంగుల తెలిపారు. సాధారణ రోజుల్లో ఒక కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెలకు అవసరం కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో ఆరో విడత హరితహారంలో భాగంగా పట్టణంలో పది లక్షల మొక్కలు నాటుతామని, అవకాశం ఉన్న చోట లాంగ్ స్పేస్ అడవులు పెంచుతామన్నారు. రామకృష్ణా పూర్, రుక్మాపూర్, సదాశివపల్లిల్లో యాదాద్రి మోడల్ లాగా చిట్టడవులు పెంచుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో జిల్లాను రోల్ మోడగా మార్చుతామని మంత్రి గంగుల ఆశాభావం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story