‘తండ్రికి తగ్గ తనయుడు.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’

by Sridhar Babu |
‘తండ్రికి తగ్గ తనయుడు.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ సమర్ధుడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలనా పరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉన్నామని గంగుల ప్రకటించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ తండ్రిక తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే విషయం టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed