- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ షర్మిలకు మంత్రి గంగుల ప్రశ్న
దిశ, కరీంనగర్ సిటీ: విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన అంశంపై వైఎస్ షర్మిల తన వైఖరి స్పష్టం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన చక్కగా సాగుతోందని, ఇతర ప్రాంతీయుల ప్రాతినిథ్యం అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాసంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ఇందుకు నిదర్శనమే కరీంనగర్‌కు తగిన ప్రాధాన్యం కల్పించడమన్నారు. కరీంనగర్ సిటీ రినోవేషన్ పేరిట నగర ఆధునికీకరణ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పురుడు పోసుకుందని వివరించారు.
పనులకు ఏప్రిల్‌లో టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించారు. ఎల్ఎండీకి ఇరువైపులా దాదాపు రెండొందల ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందన్నారు. అల్గునూర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా నీరు నిలిచి ఉంటుందని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.320 కోట్లు, చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ.80 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్రంలో చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా కరీంనగర్ మారుతుందని తెలిపారు. దేశంలోనే పేరొందేలా మానేరు రివర్ ఫ్రంట్ నిలుస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.