కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన గంగుల

by Shyam |
కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన గంగుల
X

దిశ, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నూతనంగా పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల ద్వారా.. రాష్ట్రంలో 8 లక్షల 65 వేల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి.. పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూన్ మాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 25 వేల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 3 లక్షల 9 వేల మంది అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే ఆగస్టు నుంచి ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల చైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story