- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రానైట్ దందా.. అడ్వకేట్‌కు ఝలకిచ్చిన మంత్రి గంగుల
దిశప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు, అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 152 ఏ, 505 (ii) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను కోరారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు ప్రింట్ మీడియాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం జరుగుతుందని మంత్రి గంగుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను గ్రానైట్ వ్యాపారం చేస్తున్నానని భేతి మహేందర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల తన శ్రేయోభిలాషులకు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు చెందిన వారి అనుచరులకు మధ్య శత్రుత్వం సృష్టించడంతో పాటు ప్రోత్సహించే విధంగా ఉన్నాయని గంగుల వివరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉన్నందున అలాంటి పరిస్థితికి తావివ్వకుండా వెంటనే అడ్వకేట్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కోరారు. మంత్రి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.