- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా అక్కడి నుంచే వస్తోంది.. జాగ్రత్తగా ఉండండి’
దిశ, హుజూరాబాద్: మహారాష్ట్ర నుంచే తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, తెలంగాణ మధ్య నిత్యం రాకపోకలు ఉంటాయని, మహారాష్ట్ర నుంచే తెలంగాణలో కరోనా వ్యాపిస్తోందన్నారు. ముంబై, భివండి, సూరత్ తదితర ప్రదేశాల్లో అనేక మంది చేనేత కార్మికులు పని చేస్తున్నారన్నారు. తెలంగాణకు మహారాష్ట్ర సరిహద్దు ఎక్కువ కిలోమీటర్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు ఆందోళన చెందవద్దని, మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఇప్పటికే 45, 60 ఏండ్లు పైబడిన వారికి, డయాబెటీస్ ఉన్నవారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చామని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు