- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు
దేశ ప్రతినిధి, వరంగల్ : విధులు నిర్వహించాల్సిన అధికారులు తాగి పడుకో వద్దు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో శనివారం అయినవోలు జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.
జాతరను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకంగా మారనుందని పేర్కొన్నారు. మేడారం జాతర లాగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మేడారం జాతరలో చాలా మంది అధికారులు తాగి విధులు నిర్వహించారని అన్నారు. తమతో మాట్లాడుతున్నప్పుడు అనేకమంది అధికారులు తాగి ఊగడం కనిపించిందని అన్నారు. అయినవోలు జాతరలో అలా చేయకూడదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.