కలెక్టర్ల పరిస్థితి ఇంత దారుణమా.. ఎర్రబెల్లి షాకింగ్ వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2023-05-19 09:27:46.0  )
కలెక్టర్ల పరిస్థితి ఇంత దారుణమా.. ఎర్రబెల్లి షాకింగ్ వీడియో వైరల్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ అర్బన్ క‌లెక్టరేట్ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో క‌లెక్టర్ రాజీవ్‌గాంధీపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు చేసిన వ్యాఖ్యల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సోమ‌వారం క‌లెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగుల‌ను, రాష్ట్ర ప్రజ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడేందుకు కాన్ఫరెన్స్ హాల్లో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై ప్రజాప్రతినిధులు ఆసీనుల‌వుతుండ‌గా కుర్చీల కొర‌త క‌నిపించింది.

అయితే, మంత్రి ద‌యాక‌ర్‌రావు క‌లెక్టర్ గారు.. కుర్చీలు తెండి అంటూ ఆదేశించారు. కుర్చీలు తెప్పించండి.. తెండి అంటూ.. రెండు మూడు సార్లు రిపీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి చేసిన వ్యాఖ్యల‌కు సంబంధించిన వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో వైర‌ల్‌గా మారాయి. తెలంగాణ ప్రభుత్వంలో క‌లెక్టర్లకు ఏంటీ ఈ డ్యూటీలు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా మేజిస్ట్రేట్లను ఇంత దారుణంగా చుల‌క‌న భావంతో చూడ‌ట‌మేంట‌ని కొంత‌మంది సోష‌ల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి అహంకార పూరిత వైఖ‌రికి ఆయ‌న చేసిన వ్యాఖ్యలు నిద‌ర్శన‌మంటూ మ‌రి కొంత‌మంది ఘాటు విమ‌ర్శల‌తో కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story