- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. ఎర్రబెల్లి దయాకర్
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఆరునెలల్లో టెక్స్ టైల్ పార్క్ పనులు ప్రారంభిస్తామని.. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎర్రబెల్లి తెలిపారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయడం లేదని విమర్శించారు.
మా ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతరంగా పోరాటం చేస్తోందని అన్నారు. అయితే, రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని దయాకరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విషయం తెలియకుండా రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరంగల్ అభివృద్ధికి దూరం అయిందని.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కుస్తీలు.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్న కమలం, కారు పార్టీలను ప్రజలు నమ్మవద్దన్నారు.